ఎన్నికల నగారా.. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్..
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదలచేసింది. ఎపి, తెలంగాణ లలో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎపిలోని 25 ఎంపి స్థానాలకు, తెలంగాణలోని 17 ఎంపి స్థానాలకు ఒకే రోజు.. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున ఎపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 102 స్థానాలకు గాను 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఏప్రిల్ 26వ తేదీన జరగనుంది. మొ్తం 89 స్థానాలకు గాను 13 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మూడవ విడత పోలింగ్ మే 7వ తేదీన.. 12 రాష్ట్రాల్లో 94 స్థానాలకు జరుగుతుంది. నాల్గవ విడత పోలింగ్ మే 13న జరగనుంది. అదే రోజు ఎపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 96 ఎంపి స్థానాలకు గాను 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మే 20న ఐదో దశ పోలింగః 49 స్థానాలకు గాను 8 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మే 25న ఆరో దశ పోలింగ్.. 57 స్థానాలకు గాను 7 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్.. 57 స్థానాలకు గాను 8 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.