ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా..
ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు పోలింగ్.. 10 న ఫలితాల వెల్లడి

ఢిల్లి(CLiC2NEWS): దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈమేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఇసి) సువీల్ చంద్ర శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాలలోని మోత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు 7 దశలలో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 10 వ తేదీన కౌటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.