వ‌చ్చే నెల 28న సింగ‌రేణిలో ఎన్నిక‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): సింగ‌రేణిలో ఎన్నిక‌ల సైర‌న్ మోగింది. సింగ‌రేణి కాల‌రీస్ సంస్థ‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల‌కు అక్టోబ‌రు 28న నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల అధికారి , కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ డి. శ్రీ‌నివాసులు బుధ‌వారం షెడ్యూలు విడుద‌ల చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, అదే రోజు ఓట్ల లెక్కింపు జ‌రిపి ఫ‌లితాను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

షెడ్యూలు వివ‌రాలు..

  • సెప్టెంబ‌రు 30వ తేదీన కార్మిక సంఘాల‌కు, యాజ‌మాన్యానికి మూసాయిదా ఓట‌ర్ల జాబితా అంద‌జేస్తారు..
  • అక్టోబ‌రు 3వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తారు.
  • అక్టోబ‌రు 5వ తేదీన తుది ఓట‌ర్ల జాబితా వెల్ల‌డి
  • అక్టోబ‌రు 6వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుండి అక్టోబ‌రు 7వ తేదీ సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
  • అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం
  • అక్టోబ‌రు 10వ తేదీ న మ‌ధ్యాహ్నం అర్హులైన అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల గుర్తుల కేటాయింపు.
  • అక్టోబ‌రు 28వ తేదీన ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్‌,
    అదే రోజు రాత్రి 7 గంట‌ల నుంచి ఒట్ల లెక్కింపు జ‌రిపి అనంత‌రం ఫ‌లితాలు వెల్ల‌డి..
Leave A Reply

Your email address will not be published.