ఓటర్లు… జర సోచాయించండ్రీ!

ఓటర్లు…జర సోచాయించండ్రీ
ఎన్నికలు నగారా మ్రోగింది
రాజకీయ క్రీడ మరలా మొదలైంది..!
పకృతిని పది కాలాపాటు కాపాడే
నిస్వార్ధమైన నేతను ఎన్నుకొనే సమయం ఆసన్నమైంది..!
క్షణానికో ముఖం మార్చగల
స్వార్థ నేతలు సభలు సమావేశాల్లో
తెగ సందడి చేసే సమయం ఆసన్నమైంది..!
నేతలు ఇంటి ముంగిట సాగిలబడి
పొర్లు దండాలు పెడతూ
అన్నిటికీ మేము ఉన్నామంటూ
హామీల వర్షంలో తడిసి ముద్ద చేసే
సమయం ఆసన్నమైంది..!
ఐదు సంవత్సరాలకో సారి
తొంగి చూస్తు
వచ్చే స్వార్థ రాజకీయ నాయక మాటల మాంత్రికులు
వచ్చే సమయం ఆసన్నమైంది..!
పకృతిని పది కాలాపాటు కాపాడే
నిస్వార్ధమైన నేతను
ఎన్నుకొనే సమయం ఆసన్నమైంది ఓటర్లారా ..!
మందుకి, డబ్బుకి దాసోహం కాకుండా
భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ…
మనం వేసే ఓటు ప్రపంచ పుటాలపై
పునాదులు అవ్వాలి .
-శ్రీమతి మంజుల పత్తిపాటి
9347042218
మరిన్ని `కవిత`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మన ముందుకు వచ్చింది.. మన బతుకమ్మ!