ఈసారి హోలీ మార్చి 10 నే ప్రారంభమైంది: ప్రధాని మోడి
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో బిజెపి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్‌లో అధికారం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. బిజెపి ఘన విజయం సాధించిన ఈ రోజు పెద్ద ఉత్సవం, ఉత్సాహ సందర్భమని పేర్కొన్నారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్య ఉత్సవం. ఇవాల్టి ఫలితాల్లో గొప్పప సందేశం ఉంది. ఈ సారి హోలీ మార్చి 10నే మొదలైందని అన్నారు. బిజెపి కార్యక్తలందరికీ అభినందనలు. ప్రజల నమ్మకం, విశ్వాసం పొందేందుకు కార్యకర్తల కృషి చేశారని మోడి అన్నారు.
బిజెపి ఉత్తర్ ప్రదేశ్‌లో 272 స్థానాలు
ఉత్తరాఖండ్ 47 స్థానాలు
గోవా 20 స్థానాలు
మణిపూర్ 30 స్థానాలు గెలుపొందింది.
యూపిలో మొదటిసారి బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిందని మోడి అన్నారు. యూపి, గోవా, మణిపూర్ లో మాకు ఆదరణ పెరిగిందని, గోవా ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారన్నారు. గ్యాస్, విద్యుత్, నీరు, టిలిఫోన్ సౌకర్యాలు అందరికీ వచ్చాయి. పేదలకు అందాల్సినవన్నీ హక్కుగా లభిస్తున్నాయని, వారికి అందాల్సినవన్నీ అందేవరకూ విశ్రమించనని ప్రధాని తెలిపారు.