ఇకనుండి వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు

హైదరాబాద్ (CLiC2NEWS): ఇక నుండి కరెంట్ బిల్లులు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ లోనే చెల్లించాల్సి ఉంది. జులై 1 నుండి ఫోన్‌పే, పేటిఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ నుండి చెల్లింపులు చేయడం సాధ్యంకాదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలో ఆయా యాప్స్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను సేవలనూ నిలిపి వేశాయి. ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుండి TGSPDCL విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆయా చెల్లింపు సంస్తలు ఎక్స్ ద్వారా తెలిపాయి.