ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్‌మస్క్ రికార్డ్
Elon Musk : 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి.. ప్రపంచంలో అత్యం సంపన్నుడిగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రికాడ్డు సృష్టించాడు. ప్రపంచలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల వ్యక్తి గత సంపాదన.. ఇప్పటివరకు ఇంత సంపాదించిన వ్యక్తి ప్రపంచలో లేరు. 2022లో 200 బిలియన్‌లు మాత్రమే ఉన్న ఆయన సంపాదన 2024 ముగిసేసరికి 400 బిలియన్ డాలర్లు అయ్యింది. స్పేస్ ఎక్స్‌లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 మిలియన్ డాలర్లు పెరిగి 439.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం.
అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టికి మస్క్ అత్యధిక విరాళాలు ఇచ్చి.. ట్రంప్ విజయానికి కీలక పాత్ర పోషించాడు. దీంతో మస్క్‌కు తన కాబినెట్‌లో కీలక పదవిని ఇచ్చారు. అప్పటి నుండి మస్క్ సంపాదన దినాదినాభివృద్ది చెందుతున్నట్లు సమాచారం. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్స్ దాదాపు 65% పెరిగాయని సమాచారం. స్పేస్ ఎక్స్, దాని పెట్టు బడుదారులు బుధవారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. 1.25 బిలియన్ డార్ల విలువ కలిగిన షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు , కపంఎనీ ఇన్‌సైడర్ల నుండి కోనుగోలు చేయాలి. దీంతో స్పేస్ ఎక్స్ 350 బిలియన్ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ గా స్పేస్ ఎక్స్ రికార్డు సృష్టించింది.