ఏలూరు వైద్యకళాశాలకు డాక్టర్. ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు

ఏలూరు (CLiC2NEWS): ప్రభుత్వ వైద్యకళాశాలకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాను చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినందుకు డిసిఎం పవన్‌కల్యాణ్ సిఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక దానికి ఎల్లాప్రగడ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని వైద్యారోగ్య శాఖను సిఎం చంద్రబాబు ఆదేశించారు.
వైద్య విభాగంలో డాక్టర్ ఎల్లాప్రగడ కీలకమైన అవిష్కరణలు చేశారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త సుబ్బారావు స్వస్థలం భీమవరం. ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. తొలి టెట్రా సైక్లిన్ యాంటీ బయోటిక్ అరియోమైసిన్ ను ఆయన కనుగొన్నారు. బోద, క్షయ వ్యాధుల కట్టడికి ఔషధాలు.. కాన్సర్ చికిత్సలో వాడే తొలితరం డ్రగ్స్‌ను ఆయన అభివృద్ధి చేశారు. వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టడం సముచిత గౌరవం లభించింది.