మొబైల్‌కు ఎమర్జన్సీ అలర్ట్ వచ్చిందా..? కంగారుపడకండి

Emergency Alert: దేశవ్యాప్తంగా ఈ రోజు మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జన్సీ అలర్ట్ సందేశంతో పాటు ప్లాష్ మెసేజ్ వచ్చింది. దీంతో పాటు పెద్దగా బీప్ సౌండ్ కూడా రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు అనిపించింది. దీంతో యూజర్లు ఒకింత ఆందోళనకు గురయుంటారు. అయితే దీనికి కంగారు పడకండి, అది కేంద్ర ప్రభుత్వమే పంపింది. దీనిలో భయపడాల్సినది ఏమీలేదు. ఎమర్జన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి రూపొందించింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో అనగా భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు, అంటువ్యాధులు లాంటి విపత్తుల గురించి ముందుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను రూపొందించారు. దీనిని పరీక్షించే క్రమంలో గురువారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ యూజర్లకు పెద్దగా సౌండ్‌తో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ ప్లాష్ మెసేజ్ పంపించారు.