ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ (CLiC2NEWS): తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో పెసలపాడు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మరణించినట్లు తెలుస్తుంది. మృతిచెందిన వారిలో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు.