మాదాపూర్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): మాదాపూర్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మ‌హేంద్రవ‌రానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్య‌కుమార్‌ల‌ను ఎస్ ఒటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుండి రూ. 4.2 ల‌క్ష‌ల విలువ చేసే 28 గ్రాముల ఎండిఎంఎ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు బెంగ‌ళూరు నుండి డ్ర‌గ్స్ తీసుకొచ్చి విద్యార్థుల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం. డ్ర‌గ్స్ కేసుల్లో కీల‌క నిందితుడు అయిన సోల్‌మెన్ నుండి డ్ర‌గ్స్ తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. నిందితులిద్ద‌రూ కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల కుమారుల‌ని పోలీసులు తెలిపారు. వీరు ఉన్న‌త చదువుల‌కోసం బెంగ‌ళూరుకి వెళ్లి ఈ డ్ర‌గ్స్ దందాలో దిగిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.