అమెరికా అధికారిక భాష‌గా ఇంగ్లిష్‌.. 

అమెరికా అధికారిక భాష‌గా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ.. దేశాధ్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యానికి సంబంధించిన కార్య‌నిర్వాహ‌క ఆదేశాల‌పై ఆయ‌న‌ సంత‌కం చేశారు. ఇంగ్లిష్ అధికారిక భాషగా ఏర్పాటు చేయడం వ‌ల‌న సంభాష‌ణ‌లు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డ‌మే కాకుండా ఉమ్మ‌డి జాతీయ ప్ర‌యోజ‌నాలు బ‌లోపేతం అవుతాయి. స‌మ్మిళిత , స‌మ‌ర్ధ‌వంత‌మైన స‌మాజాన్ని నిర్మించుకోవ‌చ్చు అని ఆర్డ్‌లో పేర్కొన్నారు.

ఇంగ్లిష్‌ను అధికారిక భాష‌గా గుర్తిస్తూ ఇప్ప‌టికే అమెరికాలోని 30 రాష్ట్రాలు చ‌ట్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌శాబ్దాలుగా అధికార భాష గుర్తింపు కోసం కాంగ్రెస్ చ‌ట్ట‌స‌భ స‌భ్యులు ప్ర‌య‌త్నాలు చేసినా .. స‌ఫ‌లం కాలేదు. ట్రంప్ రెండోసారి దేశాధ్య‌క్షుడుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే వైట్‌హౌస్ వెబ్‌సైట్ స్పానిష్ వెర్ష‌న్ను తొల‌గించిన‌ట్లు స‌మాచారం.

తాజాగా ఆర్డర్‌పై సంత‌కం ద్వారా ఆదేశాలు ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ నిధుల‌తో న‌డిచే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సంస్థ‌ల‌కు త‌మ సేవ‌ల‌ను, ప‌త్రాల‌ను ఇంగ్లిషేత‌ర భాష‌ల్లో కొన‌సాగించాలా , వ‌ద్దా.. అని ఎంచుకునే అవ‌కాశం క‌ల్పిస్తాయి. ఈ ప‌రిణామం దేశంలో ఐక్య‌త‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని , కార్య‌క్ర‌మాల్లో స‌మ‌ర్ద‌త‌ను నెల‌కొల్పుతుంద‌ని వైట్‌హైస్ వ‌ర్గాలు పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.