వచ్చే యేటి నుంచి 1-8 త‌ర‌గ‌తుల‌కు ఇంగ్లిష్ మీడియం: మంత్రి స‌బిత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి 1 నుండి 8వ త‌ర‌గ‌తుల్లోని విద్యార్థుల‌కు ఇంగ్లిష‌న్ మీడియం లో విద్యా బోధ‌నను ప్రారంభించ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. శాస‌న‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో `మ‌న ఊరు-మ‌న బ‌డి-మ‌న బ‌స్తీ మ‌న బ‌డి కార్య‌క్ర‌మంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు. రానున్న 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో 9వ త‌ర‌గ‌తి, 2024-25 వ విద్యాసంవ‌త్స‌రం నుంచి 10వ త‌ర‌గ‌తుల్లో ఇంగ్లీష్ విద్యా బోధ‌న‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. కేబినెట్ స‌భ్‌క‌మిటీ నిర్ణ‌యాల మేర‌కు విద్యాశాఖ‌కు ఆదేశాలు ఇచ్చామ‌ని పేర్కొన్నారు.

ముఖ్య‌మంత్రి కెసిఆర్ నాయ‌క‌త్వంలో ఈ నెల 8న విద్యాయ‌జ్ఞానికి శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి స‌భ‌కు వివ‌రించారు. `మ‌న ఊరు-మ‌న బ‌డి-మ‌న బ‌స్తీ మ‌న బ‌డి` కార్య‌క్ర‌మం ద్వారా విద్యాయ‌జ్ఞం ప్రారంభించ‌న‌ట్లు తెలిపారు. త్వ‌రలోనే ఖాళీగ ఉన్న ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని, పాత విద్యా క‌మిటీల‌నే కొన‌సాగిస్తామ‌ని, మ‌ధ్యాహ్న బోజ‌న ప‌థ‌కం బ‌కాయిల‌ను త్వ‌ర‌లోనే చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.