తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఛైర్ పర్సన్‌గా , పిసిబి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా మొత్తం 15 మంది సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. దీనిలో నియమించబడిన సభ్యులు మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు.