AP: మహిళా పోలీసు విభాగం ఏర్పాటు

అమరావతి (CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎపి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎపి మహిళా పోలీస్ సబార్డినేట్ రూల్స్ 2021కి ఆమోదం తెలిపింది. వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. మహిళా పోలీసులను మొత్తం 5 విభాగాలుగా విభజించారు. మొదటిగా నేరుగా మహిళా పోలీసులుగా నియమిస్తారు. తర్వాత సీనియర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్, ఇన్స్‌పెక్టర్ వరకు ప్రమోషన్లకు అవకాశమిస్తారు. గ్రామ, వార్డు వాలంటీర్ల నుండి 5% మందిని, మహిళా హోంగార్డులనుండి 5% భర్తీ చేయనున్నారు.