విడాకులు తర్వాత భార్యకు మనోవర్తి చెల్లించాలి.. అలహాబాద్ హైకోర్టు

లఖ్‌నవూ (CLiC2NEWS): విడాకుల అనంతరం భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని అలహాబాదద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్తకు ఉద్యోగం లేకపోయినా కూలి చేసైనా మనోవర్తి చెల్లించాలని స్ఫష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులకు 2015లో వివామం జరిగింది. వరకట్నం కోసం భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టు దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ.. భార్యకు నెలకు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు.
తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనని.. తన భార్య నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. తన తల్లిదండ్రులు, సోదరీమణులు తనపై ఆధారపడ్డారని న్యాయస్థానానికి విన్నవించాడు. అయితే తన భార్య నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందన్న విషయాన్ని ఋజువు చేయలేకపోయాడు.
ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉద్యోగం లేకపోయినా కూలీగా రోజుకు రూ. 300 నుండి రూ.400 సంపాదించే వీలుందని, భార్యకు మనోవర్తి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.