రాష్ట్రంలోని ఉద్యోగుల పదోన్నతులకు సర్వం సిద్ధం: మంత్రి హరీశ్‌రావు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/MINISTER-HARISHRAO.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్ఠం చేశారు. అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం.. డైరీ, క్యాలెండర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ స్వరూపం ఈ ఎనిమిదేళ్లలో పూర్తిగా మారిపోయిందని మంత్రి ఈ సందర్బంగా గుర్తుచేశారు. 2006వ సంవత్సరం నుండి వ్యవసాయ ఉద్యోగుల డైరీని అవిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఆఖరున ఉన్న వ్యవసాయ శాఖ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి స్థానంలో ఉందన్నారు.
ఆర్ధిక శాఖ నుండి వ్యవసాయ శాఖ వరకు ఉద్యోగుల సమస్కల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఉంటుదని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావాలని.. ఆవిధంగా సిద్ధమై వస్తే పదోన్నతులు ఇచ్చే బాధ్యత మాది అని పేర్కొన్నారు.