మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/akhilapriya.jpg)
ఆళ్లగడ్డ (CLiC2NEWS): మాజీ మంత్రి భూమా అఖిలప్రియను 307 సెక్షన్ కింద పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిల ప్రియ, ఎ.వి. సుబ్బారెడ్డి వర్గాలు కొ్త్తపల్లి వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. కాగా ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి. సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు జో్క్యం చేసుకొని ఇరువర్గాలకు సర్ధి చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. ఈ ఘటన నేపథ్యంలో అఖిలప్రియను పోలీసులు ఆళ్లగడ్డలో అరెస్టు చేసి పాణ్యం స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.