ఒయు, కెయు పరిధిలో పలు పరీక్షలు వాయిదా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సర్కార్ సోమ, మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వర్షాల నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా సోమ, మంగళ, బుధవారాలలో కాకతీయ వర్సిటీ పరిధిలో జరగాల్సి పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు.
అలాగే ఉస్మానియా వర్సిటీ కూడా నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమ, మంగళ, బుధవారాలలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలుయథాతథంగా ఉంటయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.