న్యూఢిల్లీ: ఎన్‌టిపిసిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్‌టిపిసి లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనరల్ షిప్ట్ సపోర్ట్ అండ్ సేప్టి, కంట్రోల్ రూమ్ ఆపరేషన్స్ ప్రొసెస్ ఇంజినీరింగ్-కెమికల్/ మఇమిథనాల్ విభాగాల్లో హెడ్ ఆఫ్ మెయింటెన్స్ లో 1, షిప్ట్ ఇన్‌ఛార్జ్ ఇంజినీర్స్ 2, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 5 ఉన్నాయి.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో డిప్లొమో, ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్) పిజితో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు 30 నుండి 47 ఏళ్ల వయస్సు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 9 గా నిర్ణయించారు. పూర్తి విరాలకు https://careers.ntpc.co.in/ వెబ్‌సైట్ చూడగలరు.