నిరీక్షణ

ఆరు మాసాలే అయినా అరవై యుగాలైనట్లుగా

మమతానురాగాలకు కొలమానాలుండవుగా

ఆన్‌లైన్‌లోనే అనునిత్యం

వింటున్నా, కంటున్నా కనువిందుగా నీ కదలికలను

నీ పెదాల కదలికలే పదాల అల్లికలుగా

వాలిపోతున్నాయి వాటంతట అవే

భాషకు పట్టుబడని నీ అల్లరి కేకలే

నయాగారా జలపాత సోయగాల సవ్వడిగా

ఆనందిస్తున్న ఆహ్లాదంగా

నీ చుట్టూ అనుదినం ఆరుగురి కేరింతలు

ప్రతి కదలికకు కరతాళ ధ్వనులు

సెల్‌ఫోన్ చిన్న స్క్రీన్‌పై నీ హావభావాలే

కొద్ది కాంలోనే నీ వృద్ధిని

అబ్బురంగా ఆస్వాదిస్తున్నాం

అడుగిడాలనే నీ ఆరాటం

నా హృదయాంతరాలలో చెరగని ముద్ర

మన ఎడబాటు తెలియని మహమ్మారి

హృదయ ఘోషను మిగిలిస్తున్నది

కరోనా ఖతం కావడం ఎప్పటికో

అడ్డుగోడలు బ్రద్దలు ఎప్పుడో

మూసిన దారులకు స్వేచ్ఛ రావాలి

ఆంక్షల బంధనాలలో చిక్కుకుంది లోకం

ఆశ, నిరాశల మధ్య ఊగిసలాట నాకు

నిరీక్షణ చీకటి నీడలో నిటూర్పులు

ఓదార్చుకుంటున్న నాకు నేనే

పోరాడుతున్న మనస్సు ఆరాటంతో…

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

 

త‌ప్ప‌క చ‌ద‌వండి:   విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌)

 

త‌ప్ప‌క చ‌ద‌వండి:   

శ్రావణ లక్ష్మికి స్వాగతం

కంప్యూటర్ కాపురాలు

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
1 Comment
  1. Social Media Marketing says

    Wow, marvelous blog format! How long have you been blogging for? you make running a blog look easy. The overall glance of your web site is excellent, as smartly as the content!!

Leave A Reply

Your email address will not be published.