బాణాసంచా గోదాంలో పేలుడు.. 8 మంది మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/fire-work-esplosion.jpg)
చెన్నై (CLiC2NEWS): తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా బాణాసంచా తయారు చేసే గోదాంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో దాదాపు 8 మంది మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గురైన ఈ గోదాం నివాస సముదాయల మధ్యలో ఉంది. దీంతో ఈ భారీ విస్పోటనంతో చుట్టుపక్కన ఉన్న మూడు ఇళ్లు కూడా కుప్పకూలాయి. పేలుడు భారీగా జరుగడంతో పలు మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు క్షతగాత్రలును ఆసుపత్రికి తరలించారు. కాగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.