సిర్పూర్ పేపర్ మిల్లులో పేలిన ట్రాన్స్‌ఫార్మర్!
కాగజ్‌నగర్ (CLiC2NEWS): కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ బొగ్గుగనిలో నిన్న పైకప్పు కూలి నలుగురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.