ఇండియ‌న్ బ్యాంకులో స్పెష‌ల్ ఎఫ్‌డిల డిపాజిట్ గ‌డువు పొడిగింపు

Indian Bank: ఇండియ‌న్ బ్యాంకు స్పెష‌ల్ ఎఫ్‌డి (400 రోజులు, 300 రోజులు)ల గ‌డువును పొడిగించింది. గ‌తంలో ప్ర‌వేశ పెట్టిన ఈ ప్ర‌త్యేక ఎఫ్డిల‌లో డిపాజిట్ చేయ‌డానికి 2024, న‌వంబ‌ర్ 30 తో గ‌డువు ముగిసింది. ఈ కాల‌వ్య‌వ‌ధిని 2025, మార్చి వ‌ర‌కు పొడిగించింది.

పబ్లిక్‌సెక్టార్ బ్యాంకు అయిన ఇండియ‌న్ బ్యాంకులో ఇండ్ సుప్రీమ్ 300 రోజుల ప్ర‌త్యేక ఎఫ్‌డిలో రూ. 5 వేల నుండి రూ.3కోట్ల ఉన్న డిపాజిట్ల‌పై సాధార‌ణ డిపాజిట్ దార్ల‌కు 7.05% .. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.55% , సూప‌ర్ సీనియ‌ర్ సిజిజ‌న్ల‌కు 7.80% వ‌డ్డీ పొందొచ్చు. అదేవిధంగా ఇంబ్ సుప్రీమ్ 400 రోజుల స్పెష‌ల్ ఎఫ్‌డిలో రూ.10వేల నుండి రూ.3కోట్ల వ‌ర‌కు డిపాజిట్‌ల‌పై సాధార‌ణ డిపాజిట్‌దార్ల‌కు 7.30%, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.80% ,సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 8.05% వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.