రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు: ఇసి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నవిషయం తెలిసిందే. అయితే ఎన్నికల పోలింగ్ సమయం పెంచుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజకీయ పార్టీల వినతి, వడగాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయం పెంచినట్లు ఇసి వెల్లడించింది.