ఐటి అధికారులమని రూ.50 లక్షలు దోపిడీ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/EXTORTION-MONEY.jpg)
గుంటూరు (CLiC2NEWS): గుంటూరులోని ప్రగతి నగర్‌లో ఆదాయపన్ను అధికారులమంటూ నగదు దోచుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను 48 గంటల్లో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగం శెట్టి కల్యాణి అనే మహిళ దొడ్డ ప్రసాద్ ఇంట్లో పనిచోస్తోంది. కల్యాణి ఇంట్లో కొంత నగదును, బంగారాన్ని ప్రసాద్ దాచాడు. అయితే అది ఎంత అనే విషయం కల్యాణికి కూడా తెలియదు.
కల్యాణి ఇంట్లో డబ్బు ఉందని పసిగట్టిన నిందితులు ఎలాగైనా ఆసొమ్మును కాజేయాలని పథకం వేశారు. ఐటి అధికారులమని చెప్పి కల్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి డబ్బు, బంగారం పట్టుకెళ్లారు. సిసి కెమెరా స్టోరేజ్ పాయింట్‌ను కూడా నిందితులు తీసుకెళ్లిపోయారు. బాధితురాలు కల్యాణి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో నిందుతులను పట్టుకున్నారు. నిందితులు దోచుకెళ్లెన రూ 50 లక్షలు నగదులో పోలీసులు రూ. 48.50 లక్షలు స్వాధానం చేసుకున్నారు. అర కిలో బంగారంకి గాను 132 గ్రాములు రికవరీ చేసినట్లు తెలిపారు.