ఖమ్మం మెడికల్ కాలేజ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 55 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 55 పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 19వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 20. విద్యార్హత, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ఖమ్మం లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
జనరల్ మెడిసిన్, అనాటమి, బయో కెమెస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫార్మకాలజి, సైకియాట్రి, రేడియాలజి, విభాగాలలో 55 పోస్టులు కలవు.
ప్రొఫెసర్ -2, అసోసియేట్ ప్రొఫెసర్-7, అసిస్టెంట్ ప్రొఫెసర్ -1, సిఎఎస్ స్పెషలిస్ట్ 2, సీనియర్ రెసిడెంట్-43 పోస్టులు ఉన్నాయి.
ఎండి, ఎంఎస్, డిఎన్‌బి, డిఎం/ ఎంసిహెచ్, పిజి, పిజి డిప్లొమాతో పాటు ఉద్యోగానుభవం. అభ్యర్థులు వయస్సు 31.3.2024 నాటికి 69 ఏళ్లు మించకూడదు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://gmckhammam.org/# వెబ్‌సైట్ చూడగలరు.