‘ఫెయింజల్’ తుఫాను ఎఫెక్ట్.. ఎపిలోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ !

అమరావతి (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఫెయింజల్ తుపాను వేగంగా కదులుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం వద్ద పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు సమాచారం. ఈ తుపాను గంటకు 6 నుండి 10 కి.మీ వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.