ఫేక్ సర్టిఫికెట్‌లతో ఏడుగురికి ఎంబిబిఎస్ సీట్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/FAKE-CERTIFICATES.jpg)
వరంగల్ (CLiC2NEWS): స్థానిక కోటా కింద సీట్లు పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఏకంగా ఎంబిబిఎస్ సీట్లను పొందారు. ఈ ఘటన కాళోజి వైద్య విశ్వ విద్యాలయంలో చేటుచేసుకుంది. ఎపి కి చెందిన ఏడుగురు విద్యార్థులు ఫేక్ సర్టిఫికెట్‌లతో ఎంబిబిఎస్ సీట్లను పొందినట్లు గుర్తించారు. ఈ మేరకు వర్సిటి రిజిస్ట్రార్ డా. ఎస్ సంధ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను కాళోజి వర్సిటి నోటిఫికేషన్ విడుదల చేయగా.. సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థులపై అనుమానం వచ్చింది. ఎపికి చెందిన వీరు 6వ తరగతి నుండి 9వరకు తెలంగాణలో చదివినట్లు సర్టిఫికెట్ క్రియేట్ చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంట్రన్స్ టెస్ట్ అన్నీ ఎపి నుండి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు తెలిపారు. వర్సిటీ వీరి ప్రవేశాలను రద్దు చేసి.. వీరితోపాటు ఈ దందాకు సూత్రధారి విజయవాడకు చెందిన కామిరెడ్డి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.