హైదరాబాద్‌లో విషాదం.. కుటుంబం ఆత్మహత్య!
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ముషీరాబాద్‌లో దారుణం చోటుచోసుకుంది. ఓ కుటంబంలోని దంపతులు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సాయికృష్ణ, చిత్రకళ దంపతులు. వీరికి ఆరెళ్లు కూతురు కూడా ఉంది. వీరిద్దరి ఉద్యోగాలు పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే వీరి మృతికి గల కారణాలను గోడపై రాసి ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. గోడపై పలువురి పేర్లు రాసినట్లు పోలీసులు గుర్తించారు.