ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్

హైదరాబాద్ (CLIC2NEWS): ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఇంట్లో స్నానాల గదిలో మృతిచెందారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నారు. మృత దేహం పక్కనే కార్భన్ మోనాక్సైడ్ సీసాను పోలీసులు గుర్తించారు. కార్భన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యుష ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. నేను కోరుకన్న జీవితం ఇది కారు. ఒంటరి జీవితంతో విరక్తి చెందా. తల్లిదండ్రులకు భారం కాలేను. నన్న క్షమించండి అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ప్రత్యూష బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు.