12న రైతు ధర్నాలు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సిఎం కెసిఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ను ఉతికారేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొల్లు పురాణం చెప్పారని పేర్కొన్నారు. ప్రశ్నించిన వాళ్లందర్ని దేశద్రోహులా బీజేపీ చిత్రకరిస్తుందని తెలిపారు. దేశం దురాక్రమణకు గురవుతుందని చెప్తే.. దోశద్రోహులు, అర్భన్ నక్సలైట్లు అని ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.
“తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనను అని చెబుతున్నావ్. ఇది నీ చేతకాని తనం కాదా? కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపడుతాం. లక్షలాది మంది రైతులతో కలిసి ధర్నాలు చేయబోతున్నాం. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలాలి. రైతులతో కలిసి పోరాడుతాం. శుక్రవారం మాతో కలిసి నువ్వు కూడా ధర్నాకు కూర్చుంటావా? తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే. “ అని సిఎం స్పష్టం చేశారు.