రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ. 12వేలు
జనవరి 26 నుండి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు: సిఎం
హైదరాబాద్ (CLiC2NEWS): రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ. 12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 26 నుండి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. కేబినేట్ సమావేశానంతరం సిఎం మీడియాకు వివరించారు.
రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.10వేలు ఇస్తే.. ఈ సర్కార్ రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నారు. తండాలు, గూడేలు,మారుమూల గ్రామాలు, పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టారు. ఈ పథకాలన్నీ జనవరి 26 నుండి అమలు చేయనున్నట్లు సిఎం వెల్లడించారు.