ఘోర ప్రమాదం: 40 మందితో నదిలో పడిన బస్సు

థార్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణే వెళ్తోన్న ఒక బస్సు థార్ జిల్లాలోని ఖాల్‌ఝఘాట్ ప్రాంతంలోని నర్మదా నిది వంతెనై వెళ్తుండగా అదుపు తప్పి నదిలో పడిపోయింది. బస్సు వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నదిలో బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు దుర్మణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మంది రక్షించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి సరోత్తమ్ మిశ్రా చెప్పారు. మిగతా వారికోసం భారీగా గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.