జహీరాబాద్-బీదర్ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

సంగారెడ్డి (CLiC2NEWS): సంగారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కల్పోయారు. బైక్‌ను అర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జహీరాబాద్-బీదర్ రహదారిపై చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక ఆర్‌టిసి బస్సు .. బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.