ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి
ఇన్నోవా కారును ఢీకొన్న బస్సు
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/ROAD-ACCIDENT-IN-KARNATAKA-STATE.jpg)
మైసూరు (CLiC2NEWS): విహారయాత్రకు వెళ్లిన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మైసూరు జిల్లాలోని టి. నరసిపూర్ ప్రాంతంలో ఇన్నోవా కారును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మరణించారు. మృతులంతా బళ్లారికి చెందిన ఒకే కుటుంబం వారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.