హాథ్రస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

హాథ్రస్ (CLiC2NEWS): హాథ్రస్ ఆగ్ర-అలీగఢ్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ఓ బస్సు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.