తండ్రైన దిల్‌రాజు..
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్‌రాజు తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని బుధవారం ఉదయం పండంటి మగబిడడ్కు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దిల్‌రాజు మొదటి భార్య మరణాంతరం ఆయన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2020 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం దిల్‌రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్ఆనయి. ఒకటి విజయ్-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో రానన్న `వారసుడు`.. మరొకటి శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.