ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ ఫీ షెడ్యూల్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ప‌దోత‌ర‌గ‌తి వార్షిక ఫీజు షెడ్యూల్‌ను గురువారం విడుద‌ల‌చేశారు. వ‌చ్చే ఏడాది మార్చిలో ప‌దోత‌ర‌గ‌తి పరీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులు ఈ నెల 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కూ.. రూ. 200 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 11 వ‌ర‌కూ.. రూ. 500 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లించ‌వ‌చ్చు. రెగ్యుల‌ర్ విద్యార్థులు, మూడు అంత‌కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెల‌య్యిన వారు రూ. 125, మూడు కంటే త‌క్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110 , వొకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.