కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బోనస్
న్యూఢిల్లీ (CLiC2NEWS) : దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్-హాక్ బోనస్)ను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు మరియు కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులు.