పండగ సీజన్.. ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌ల ధరలపెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో రైల్వేశాఖ ప్లాట్‌ఫారమ్ ధలను భరీగా పెంచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 15 రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రూ. 10 టిక్కట్ ధర రూ 50పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, లింగంపల్లి, బేగం పేట స్టేషన్‌లలో
రూ. 10 నుండి రూ. 20 వరకు పెంచారు. పెరిగిన టిక్కెట్టు ధరలు జనవరి 10వ తేదీ నుండి 20 వరకు ఉంటాయని తెలిపారు. కరోనా వేళ ప్రయాణికులతో పాటు వచ్చే బంధువులు, స్నేహితుల రాకను నియంత్రించేందుకు ధరలను పెంచినట్లు తెలుస్తోంది.