వరంగల్ కాటన్ కార్పొరేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్/ అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ క్లర్క్ వర్క్ (గోడౌన్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ ,2024 నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 16. ఎంపికైన అభ్యర్థులు.. నెలకు ఫీల్డ్ స్టాఫ్కు రూ. 37,000.. ఇతర పోస్టులకు రూ. 25,5000 జీతం అందుతుంది. ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2,3వ అంతస్తు, లక్ష్మీపురం, పాత గ్రైన్ మార్కెట్ దగ్గర , వరంగల్ .పూర్తి వివరాలకు https://cotcorp.org.in/ వెబ్సైట్ చూడగలరు.