భార‌త రాష్ట్రప‌తికి ఫిజి అత్యున్న‌త పౌర‌ పుర‌స్కారం..

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఫిజి దేశ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన కంపానియ‌న్ ఆఫ్ ది ఆర్డ‌ర్ ఆఫ్ ఫిజిని అందుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్రప‌తి కార్యాల‌యం ఎక్స్‌లో తెలిపింది. ఈ సంద‌ర్బంగా ద్రౌప‌ది ముర్మ మాట్లాడుతూ.. ఫిజిని బ‌లమైన‌, సంపన్న దేశంగా మార్చేందుకు భార‌త్ అండ‌గా నిలుస్తుంద‌ని, దీంతో రెండు దేశాల ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌న్నారు. ద్వీప‌దేశ‌మైన ఫిజిలో భార‌త రాష్ట్రప‌తి ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి.

Leave A Reply

Your email address will not be published.