Dadasaheb Phalke Film Festival Awards – 2023

ముంబయి (CLiC2NEWS): దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ప్రధానోత్సవం ముంబయిలో నిర్వహించారు. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వరించింది. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును’ కాంతారా’ నటుడు, డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘ది కాశ్మీర్‌ఫైల్స్’ అవార్డును దక్కించుకుంది.
ఇక ఉత్తమ నటిగా ఈ ఆలియాభట్ (గంగూబాయి కాఠియావాడి) ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1) పురస్కారాలను అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలందించినందుకు 2023 దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ రేఖ అందుకున్నారు.