ఆదివారం భార‌త్‌-అస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ పోరు

World Cup (CLiC2NEWS) : భార‌త్.. అయిదుసార్లు వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత అస్ట్రేలియాతో ఫైన‌ల్ పోరు ఖ‌రారైంది. సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌పై విజ‌యం సాధించి భార‌త్‌ ఫైన‌ల్‌కు చేరుకోగా.. ద‌క్షిణాఫ్రికాను ఓడించి ఆసీస్ ఫైన‌ల్ పోరుకు సిద్ధ‌మైంది. ఆదివారం ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీనికి అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోడీ స్టేడియం వేదిక కానుంది.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌-అస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆసీస్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేర‌టం ఎనిమిదోసారి. 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రోహిత్ సేన అజేయంగా ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌ల‌లో ఒక్క‌సారి కూడా భార‌త్ జ‌ట్టు ఆలౌట్ కాలేదు. ఒక ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం ప‌దో వికెట్ వ‌ర‌కు బ్యాటింగ్‌కు వెళ్లింది. ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 201-4తో టీమ్ ఇండియా విజాయ‌న్ని అందుకుంది.  బౌల‌ర్లు సైతం  ఆసీస్ బ్యాట‌ర్ల‌ను 200లోపు స్కోరును ప‌రిమితం చేశారు. ఫైన‌ల్ లో కూడా ఇదే విధంగా ఆడితే భార‌త్ విజ‌య‌ప‌తాకం ఎగుర‌వేస్తుంది.

భార‌త్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ చూస్తే.. ఓపెన‌ర్‌గా దిగిన రోహిత్ ఎటువంటి పిచ్‌పైన అయినా.. అద్భుతంగా రాణిస్తున్నాడు. వ‌సీం అక్రం వంటి వారు కూడా అత‌డి బ్యాటింగ్‌కు మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. గిల్‌, విరాట్, శ్రేయ‌స్‌లు బౌల‌ర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆర్థశ‌తకాలు వ‌రుస‌క‌ట్టాయి. ఇక బౌల‌ర్లు సైతం జ‌ట్టు విజ‌యంలో ప్ర‌ముఖపాత్ర పోషిస్తున్నారు. బ‌ల‌మైన బౌలింగ్ తో టీమ్ ఇండియా ఫైన‌ల్‌కు సిద్ద‌మ‌వుతోంది.

Leave A Reply

Your email address will not be published.