గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్దిక సాయం..
రాంచీ (CLiC2NEWS):తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందించారు. ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌తో సమావేశమైన సిఎం కెసిఆర్ ఆయన ఆధికారిక నివాసంలో రూ. 10 లక్షల చెక్కులను ఇద్దరు అమరజవాన్ల కుటుంబాలకు అందజేశారు. అమర వీరుల కుటుంబాలను పరామర్శించారు. భారత్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన యుద్ధంలో తెలంగాణకు చెందిన కల్నల్‌తో సంతోష్ కుమార్‌తో పాటు 19 మంది భారత జవాన్లు మరణించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని అప్పుడు సిఎంకెసిఆర్ ప్రకటించారు. తెలంగాణప్రభుత్వం తరపున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు. వీరిలో ఇద్దరు ఝార్ఖండ్‌కు చెందినవాళ్లున్నారు. వీరి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ రాంచీలో స్వయంగా అందజేశారు.