నాంప‌ల్లిలోని ఓ గ్యారేజ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నాంప‌ల్లిలోని బ‌జార్‌ఘాట్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ భ‌వ‌నంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గ్యారేజ్‌లో మంట‌లు అలుముకొని ప‌క్క‌నే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. పోలీసులు తెలిపిన వివారాల మేర‌కు.. భ‌వ‌నంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గ్యారేజ్‌లో కారు రిపేర్ చేస్తుండ‌గా మంట‌లు చెల‌రేగి.. అక్క‌డే ఉన్న డీజిల్‌, కెమిక‌ల్ డ్ర‌మ్ములకు మంట‌లు అలుముకున్నాయి. భ‌వ‌నంలోని పై అంత‌స్థుల‌కు మంట‌లు వ్యాపించ‌డంతో పొగ‌చూరి ఊపిరాడ‌క కొందరు చనిపోయార‌ని తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లంలో నాలుగు ఫైరింజ‌న్ల స‌హాయంతో సిబ్బంది మంట‌న‌లు అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. చుట్టుప్ర‌క్క‌ల అపార్ట్ మెంట్‌లో ఉన్న స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.