రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ (CLiC2NEWS): Fire accident in a plastic company in Rajendranagar రాజేంద్రనగర్‌లోని ఓ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు కంపెనీ మొత్తానికి వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసి పడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేసే కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయిన ప్రాథమికంగా నిర్థారించారు.