ఏలూరు జిల్లాలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం: ఆరుగురు మృతి
ఏలూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి రియాక్టర్ పేలిపోయింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవదహనమయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందాడు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరణించిన వారులో నలుగురు బిహార్ వాసులున్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 150 మంది ఉన్నట్లు సమాచారం. తీవ్రగాయలపాలైన వారిని మెరుగైన చికిత్సకోసం విజవాడ జిజిహెచ్కి తీసుకొళ్లారు. 12 మందికి 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని వైద్య సిబ్బంది వెల్లడించారు.