ఫ‌ల‌క్‌నుమా ఎక్స్‌ప్రెస్ 5 బోగీలు ద‌గ్ధం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం..

భువ‌నగిరి (CLiC2NEWS): హావ్‌డా నుండి సికింద్రాబాద్ వ‌స్తున్న ఫ‌ల‌క్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో షార్ట్ స‌ర్క్యూట్ కారంణంగా మంట‌లు చెల‌రేగాయి. పొగ‌లు వ‌స్తుండటం గ‌మ‌నించిన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై రైలును నిలివేశారు. ఆ రెండు బోగీల్లోని ప్ర‌యాణికులను కిందికి దింపేశారు. దీంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. మంట‌లు ఇత‌ర బోగీల‌కు వ్యాపించి ద‌ట్ట‌మైన పొగ‌లు అలుముకున్నాయి. ఐదు బోగీలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌నగిరి జిల్లాలోని ప‌గిడిప‌ల్లి-బొమ్మాయిప‌ల్లి మ‌ధ్య జ‌రిగింది. ద‌క్షిణ మ‌ధ్యా రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అరుణ్ కుమార్ జైన్ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.